వేతన సవరణపై వచ్చే వారంలో ముఖ్యమంత్రి నిర్ణయం!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల వేతనసవరణ, ఇతర అంశాలపై ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ చర్చలు ముగిశాయి. శనివారం కొన్ని సంఘాలు తమ వినతులు సమర్పించాయి. మరికొంత సమాచారాన్ని అందజేశాయి. చర్చల ప్రక్రియ ముగియడంతో త్రిసభ్య కమిటీ సాయంత్రం సమావేశమై ఉద్యోగుల అభిప్రాయాలు, వినతుల క్రోడీకరణ చేపట్టింది. ఒకట్రెండు రోజుల్లో తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనుంది.
0 comments:
Post a comment