📚✍పెన్షనర్లకు అందని నగదు
♦అదే బాటలో జీపీఎఫ్
♦నిరాశలో రిటైర్మెంట్ ఉద్యోగులు
🌻అమరావతి, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరంలో సకాలంలో పెన్షన్ అందుతుందని ఎదురు చూసిన పెన్షనర్లకు నిరాశ ఎదు రైంది. ప్రతినెలా ఒకటవ తేదీన ఉద్యోగుల జీతాలతో పాటు పాటు పెన్షనర్ల బాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసేది. అయితే ఉద్యోగులకు జీతాలిచ్చి తమ పెన్షన్లు ఆపారని పెన్ష నర్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు మూడున్నర లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు రెండవ తేదీ సాయంత్రం వరకు పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు వేయ కపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఆదివారం సెలవు కావడం తో సోమవారం పెన్షన్లు అందవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా రి టైర్మెంట్ ఉద్యోగుల జీపీఎఫ్ కూడా రెండు నెలలుగా పెండింగులో పెట్టినట్లు చెబుతున్నారు.
0 comments:
Post a comment