ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసి కోడ్ ను అమల్లోకి తీసుకురాగా, ప్రభుత్వం దానిని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు లో సింగిల్ బెంచ్ ఎన్నికల నిర్వహణను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.
ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణను ఈనెల 18కి హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 18 వ తేదీన విచారణ చేద్దామని హైకోర్టు చెప్పగా, హౌస్ మోషన్ పిటిషన్ ను అర్జెంట్ కేటగిరిలో విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్ కోర్టుకు వివరించింది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు 4వేల మెయిల్స్ వచ్చాయని, ఎలక్ట్రోరల్ లిస్ట్ కూడా ఆగిపోతుందని ఎస్ఈసి కోర్టుకు తెలిపింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ను ఎత్తివేస్తే ఎన్నికల నిర్వహణను జాప్యం చెప్పబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
0 Comments:
Post a Comment