ఏపీ హైకోర్టు కొత్త సీజే ప్రమాణస్వీకారం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేశారు జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి... ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక, ప్రమాణస్వీకారం చేసిన చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్.
0 comments:
Post a comment