ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రపాకం కోసం వెంకట్రామిరెడ్డి అరాటపడుతున్నారని విమర్శించారు. వెంకట్రామిరెడ్డికి కిందిస్థాయి ఉద్యోగులతో సంబంధాలే లేవని కానీ అన్ని ఉద్యోగ సంఘాల్లో జ్యోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు.
పంచాయతీ ఎన్నికల విషయంలో మేము సుప్రీం తీర్పును గౌరవిస్తామని బొప్పరాజు తెలిపారు.
కొంతమంది మాకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తున్నారని, మేము మా ప్రాణం కోసం మాత్రమే వ్యాఖ్యాలు చేశామన్నారు.
ఏపీ జేఏసీ ఎక్కడా కోర్ట్ కి వెళ్ళలేదని గుర్తు చేశారు. ఫెడరేషన్ పేరుతో వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కారణంగా ప్రజల్లో, ఉద్యోగుల్లో చులకన భావన ఏర్పడిందన్నారు. వారి తీరు పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
0 comments:
Post a comment