🔳మెడికల్ కౌన్సెలింగ్‌లో గోల్మాల్!
బీ-కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలు.. మరో దశ కౌన్సిలింగ్‌కు డిమాండ్
విజయవాడ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సీటుకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శి స్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లన్నింటినీ (15ు నేషనల్ కోటా మినహా) కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లో 50ుకన్వీనర్ కోటా(ఏ-కేటగిరీ)లో, 35ుు పేమెంట్ కోటా(బీ-కేటగిరీ)లో, 15ు ఎన్ఆర్ఐ కోటా(సీ-కేటగిరీ)లో భర్తీ చేస్తారు. ఏ-కేటగిరీ కన్వీనర్ సీట్ల భర్తీకి 4 దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అప్పటికీ మరో 5 సీట్లు మిగిలాయంటూ 5వ దశ కూడా నిర్వహించారు. కానీ బీ-కేటగిరీకి మాత్రం పొదుపు పాటించారు. ఈ సీట్ల భర్తీకి మొదటి దశ కౌన్సెలింగ్ అనంతరం 50ు సీట్లు మిగిలిపోయాయి. ఆ తర్వాత రెండో దశ నిర్వహించగా 109 సీట్లు మిగిలాయి. వీటిని భర్తీ చేసేందుకు మూడో దశ కౌన్సెలింగ్ పెట్టకుండా చివరి దశగా పేర్కొంటూ మాపప్ రౌండ్‌కు గురువారం సాయంత్రం 5గంటలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సాధారణంగా ఒకటి రెండు సీట్లు మిగిలితే ఈ రౌండ్ నిర్వహిస్తారు. కానీ 109సీట్లు ఉన్నా మాపప్ రౌండ్‌కు వెళ్లడం పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీ-కేటగిరీ సీట్లను సీ-కేటగిరీగా మార్చేసి ప్రైవేట్ యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమ య్యారని ఆరోపిస్తున్నారు. సీ-కేటగిరీలో ఫీజు రూ.35లక్షలు కాగా యాజమాన్యాలు వాటిని రూ.కోటిన్నర వరకు విక్రయించుకుంటాయి. ఈ నేపథ్యంలో బీ-కేటగిరీ సీట్లభర్తీకి మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
0 comments:
Post a comment