💁♀️అరచేతిలోనే అంతా..!
🔰మై ఫాస్టాగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినజాతీయ రహదారుల విభాగం..
🔰కొనుగోలు, యాక్టివేషన్, రీచార్జ్, వాలెట్ సదుపాయాలు..
🔰వాహన నెంబరుతో రిజిస్ట్రేషన్.. బ్యాలెన్స్ వివరాలూ అక్కడే..
🔰టోల్గేట్ల సమగ్ర సమాచారమూ అందులోనే..
🍁ఏలూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి):
🔰కొత్త ఏడాది కొత్త యాప్‌తో ముందుకు వచ్చింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ. ఈ ఏడాది నుంచి జాతీయ రహదారులపై ప్రయాణానికి ఫాస్టాగ్ అనివార్యం కానుండడంతో అందుకు అనుగుణంగా ‘మై ఫాస్టాగ్’ అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తప్పనిసరి ఫాస్టాగ్ విధానం ఈనెల 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నప్పటికీ దానిని ఫిబ్రవరి 15 వరకూ వాయిదా వేసిన కేంద్రం, యాప్‌ను మాత్రం సకాలంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ మన మొబైల్లో ఉంటే చాలు.. అందులో ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఫాస్టాగ్ లేని వారు కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, దాని ద్వారా ఫాస్టాగ్‌ను పొందవచ్చు. అందుకోసం ఒక స్మార్ట్‌ఫోన్, వాహన రిజిస్ట్రేషన్ నెంబ రు ఉంటే చాలు. వాహనదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని వాహన నెంబరును అందులో రిజిస్టర్ చేసి లాగిన్ అయితే యాప్ యాక్టివేట్ అవుతుంది. యాప్ యాక్టివేట్ అయిన వెం టనే ఆన్లైన్ ద్వారా ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు, యాక్టివేట్, రీచార్జ్ చేసుకోవచ్చు
🍁ఫాస్టాగ్ కొనుగోలు చేయొచ్చు..
🔰యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయితే అందులోనే ఆన్లైన్ ద్వారా ఫాస్టాగ్‌ను కొనుక్కోవచ్చు. ఫాస్టాగ్‌ను కొనుగోలు చేసేందుకు వీలుగా ‘బై ఆన్లైన్’ అనే ఐకాన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఆన్లైన్ ద్వారా ఫాస్టాగ్‌లు అమ్మే ఈ కామర్స్ సంస్థలు కనిపిస్తాయి. అవసరమైన వారు అక్కడ ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు. సమీప ప్రాం తంలోని ఫాస్టాగ్ పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) లు ఎక్కడున్నాయో గూగుల్ మ్యాపు ద్వారా వెతుక్కోవచ్చు. తద్వారా దగ్గరలోని సెంటర్‌కు వెళ్లి ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు. కొనుగోలు చేసిన ఫాస్టాగ్‌ను బ్యాంకుకు లింక్ చేసుకోవడానికి వీలుగా యాప్‌లోనే ‘లింక్ విత్ బ్యాంకు అకౌంట్’ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ బ్యాంకు లింకేజీ చేసుకోవచ్చు.
🍁రీచార్జ్ ఇలా..
🔰యాప్‌లోనే ఫాస్టాగ్ రీచార్జ్ వెసులుబాటు ఉంటుంది. యూపీఐ ద్వారా సులువుగా రీచార్జ్ చేసుకోవడానికి వీలుగా యూపీఐ ఐకాన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్లు వస్తాయి. వాటి ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్టుగా మీ బ్యాంకు బాలెన్స్ నుంచి మీకు కావాల్సిన రీ చార్జ్ చేసు కోవచ్చు. లేదంటే కొత్త మొత్తాన్ని వాలెట్లో జమ చేసుకుని తద్వారా రీచార్జ్ చేసుకుంటుండ వచ్చు. నేరుగా బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి ‘లాగిన్ టు బ్యాంక్ పోర్టల్’ ఆప్షన్ ఉంటుంది.
🍁యాక్టివేట్ ఫాస్టాగ్..
🔰యాప్ ద్వారా ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు వీలుగా ‘యాక్టివేట్ ఫాస్టాగ్’, క్రియేట్ ఫాస్టాగ్ వాలెట్’, యాక్సెస్ యువర్ ఫాస్టాగ్ వాలెట్ ఆప్షన్లు ఉంటాయి. వాటి ద్వారా ఫాస్టాగ్, వాలెట్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.
🍁సకల సమాచారం..
🔰జాతీయ రహదారులకు సంబంధించిన సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఆయా జాతీయ రహదారులు, వాటిపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల జాబితా యాప్‌లో ఉంటుంది. తద్వారా తమ ప్రయాణంలో ఎన్ని టోల్‌ప్లాజాలు రాబోతున్నాయో ముందుగానే తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఫాస్టాగ్‌కు సంబంధించిన ప్రశ్నలు, సందేహాలు కూడా తెలుసుకోవచ్చు. అందు కోసం 1033 అనే ఐకాన్ ఉంటంది. దీంతోపాటు వాలెట్ బాలెన్స్ తెలుసుకోవా లనుకుంటే రిజిస్టర్ మొబైల్ నెంబరు నుంచి 88843 33331 నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. బ్యాలెన్స్ వెంటనే తెలుస్తుంది.
0 comments:
Post a comment