ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం...
అమరావతి: బిల్డ్ ఏపీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిక్యుజల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని హైకోర్టు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.
ఈ పిటిషన్పై త్వరలో విచారణ జరిగే అవకాశముంది.
0 comments:
Post a comment