ప్రపంచ ఆరోగ్యసంస్థ సంచలన ప్రకటన: ఒకటి కాదు నాలుగు స్ట్రెయిన్లు గుర్తింపు
కరోనాతో ప్రపంచం విలవిలలాడిపోతుంది. వైరస్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం కొంతకాలం స్తంభించిపోయింది. దీంతో ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ప్రపంచం ఇబ్బందులకు గురైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కొత్త స్ట్రైన్ భయపెడుతున్నది. ఈ స్ట్రైన్ యుకేలో మొదలైంది. సెప్టెంబర్ లో యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ డిసెంబర్ నాటికి బయటపడింది. అయితే, యూకేలో బయటపడిన ఈ కొత్త స్ట్రెయిన్ కు ఫైలోజెనిటిక్ సంబంధం లేకపోవడంతో ఈ వైరస్ జన్మరహస్యం అంతుచిక్కనిదిగా మారింది. దేనికంటే ముందు ఆగష్టు, సెప్టెంబర్ లో డెన్మార్క్ లో కొత్త స్ట్రైన్ ను కనుగొన్నారు. ఈ స్ట్రైన్ ను మింక్ జంతువుల్లో కనుగొన్నారు. ఈ కొత్త స్ట్రైన్ కు క్లస్టర్ 5 గా నామకరణం చేశారు. మనిషిలోని రోగనిరోధక శక్తితో సమర్ధవంతమగా పోరాటం చేసి, మనిషిలో ఇమ్మ్యూనిటి పవర్ ను తగ్గిస్తుంది.
ఇక ఇదిలా ఉంటె తొలిసారిగా వుహాన్ లో 2019 లో బయటపడిన వైరస్ 2020 జనవరిలో డి614జీ గా జన్యుమార్పిడి జరిగిందని ఈ స్ట్రైన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా, యూకేతో పాటుగా దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త స్ట్రైన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
Bryophyllum uses explain sir
ReplyDelete