అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్ ఇవ్వాలని సూచించామని చెప్పారు. వ్యాక్సినేషన్లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరామన్నారు. సీఎస్తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి అని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ''ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి. ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఎదుర్కొన్న ఘనత ఏపీ ఉద్యోగులదే. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరు.
రాజకీయాలకతీతంగా పంచాయతీ ఎన్నికలు. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సమిష్టి కృషితో ఎన్నికలను పూర్తి చేద్దాం.'' అని రమేశ్ కుమార్ లేఖలో కోరారు.
0 comments:
Post a comment