ఆర్మీ క్యాంటీన్ వస్తువులు ఇకపై ఆన్లైన్లో....
దిల్లీ: భారత సైన్యంలో పనిచేస్తున్న సిబ్బందికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సీఎస్డీల్లో (క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్) లభించే ఖరీదైన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలు కల్పించింది. దీనికి సంబంధించిన పోర్టల్‌ను (https://afd.csdindia.gov.in) రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం ప్రారంభించారు. సుమారు 45 లక్షల మంది సిబ్బంది ఏఎఫ్‌డీ-1 కేటగిరీలోని వస్తువులను ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసే సౌలభ్యం కలగనుంది.
వాషింగ్ మెషీన్లు, మైక్రో ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటివి ఏఎఫ్‌డీ-1 కేటగిరీ కిందకు వస్తాయి.
ఈ కేటగిరీ కిందకు వచ్చే ఎయిర్ప్యూరిఫైయర్లు, హోం థియేటర్లు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. సైన్యంలో పనిచేస్తున్న వారితో పాటు ఎక్స్ సర్వీస్‌మెన్ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. జవాన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ పోర్టల్‌ను తీసుకొచ్చామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
0 comments:
Post a comment