🔳వేతనాల విషయంలో అధికారులను ఆశ్రయించండి
ఈనాడు, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పనికి తగ్గ వేతనం కల్పించేలా ఆదేశించాలంటూ జనసేన నాయకుడు డి.మహేశ్ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారం పూర్తిగా కార్మిక వివాద వ్యవహారమని పేర్కొంది. ఈ విషయంలో పిల్ దాఖలు చేయడం సరికాదని తెలిపింది. కార్మికసంఘాలు, కార్మికులు వేతనాల విషయంలో సంబంధిత అధికారులు/ ఫోరంలను ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
షిఫ్ట్ ఆపరేటర్ల భర్తీపై హైకోర్టు స్టే
విద్యుత్ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
0 Comments:
Post a Comment