🔳ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్‌కి తెలంగాణ ఉపాధ్యాయుడి ఎంపిక
హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్‌కి తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు లింగాల రాజు ఎంపికయ్యారు. ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీఈఏ) కింద 2019-20 విద్యా సంవత్సరానికి భారత్ నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపిక కాగా అందులో రాజు ఒకరు. ఈ కార్యక్రమం కింద ఆయన ఆరు వారాలపాటు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల బోధనపై శిక్షణ పొందుతారు. ఆ వర్సిటీల అనుబంధ పాఠశాలల్లో బోధన చేస్తారు. అమెరికా-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్(యూఎస్‌ఐఈఎఫ్) ఏటా కొంత మంది ఉపాధ్యాయులను ఈ ప్రోగ్రామ్‌కి ఎంపిక చేస్తుంది. రాజు ఈ నెలలోనే అమెరికా చేరాల్సి ఉండగా కరోనా కారణంగా సెప్టెంబరులో వెళ్లనున్నారు. తాను 2018లో తుది రౌండ్‌కు చేరుకున్నా ఎంపిక కాలేదని, ఈసారి అది నెరవేరిందని రాజు ఆనందం వ్యక్తం చేశారు.
0 Comments:
Post a Comment