📚 టెట్ సిలబస్ కూర్పుపై నిపుణుల కమిటీ సమావేశం
అమరావతి, ఆంధ్రప్రభ :-
రాష్ట్రంలో త్వరలో నిర్వహించ బోయే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) సిలబస్ స్ట్రక్చర్ పై నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఎస్ సీ ఈఆర్టీ కార్యాలయంలో బుధ వారం డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి వివిధ అంశాలపై నిపుణుల కమిటీ తో చర్చించారు. నేషనల్ ఎడ్యుకేష నల్ పాలసీ, ఇంగ్లీష్ మీడియంలో బోధన, కొత్త పాఠ్యాంశాలను ప్రవే శపెట్టిన నేపథ్యంలో టెట్ సిలబస్ ను ఏ విధంగా సిద్ధం చేయాలనే అంశంపై డైట్ కళాశాలలు, జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఎస్సీ ఈఆర్టీ అధికారులు సమావేశం అయ్యారు. వీలైనంత త్వరగా సిలబసన్ను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
0 Comments:
Post a Comment