విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకు ఇవ్వండి
🌻న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకు ఇచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయాలని కేంద్ర విద్యాశాఖకు పార్లమెంటరీ కమిటీ సూచించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విద్యా సంవ త్సరంలో ఏర్పడిన లోటును పూడ్చేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొంది. బోర్డు పరీక్షల్లో వచ్చే అవకాశమున్న అన్ని సబ్జెక్టుల్లోని ప్రశ్నలతో తయారయ్యే ఈ క్వశ్చన్ బ్యాంకును పరీక్షలకు ముందుగానే విద్యార్థులకు అందజేయాలని కోరింది. విద్యార్థుల్లో విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను అంచనా వేసేలా ఇందులోని ప్రశ్నలుండాలని సూచించిం ది. దీని వల్ల విద్యార్థుల్లో పరీక్షలంటే ఉండే భయం, ఆందోళన తగ్గుతాయని తెలిపింది. కోవిడ్ కారణంగా విద్యార్థులు ఆన్లైన్ తరగతు లకు హాజరయ్యారనీ, అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ, లా్యాప్టాప్లు, సెల్ ఫోన్లు లేని కారణంగా పేదలు క్లాస్‌లను మిస్ అయ్యారని తెలిపింది.
0 comments:
Post a comment