ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నాలుగు దశలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలను ఆయన ఈరోజు వెల్లడించారు. ఈ నెల 23 తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు..
రాష్ట్రంలో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ అంశం మీద ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళే యోచనలో ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఎన్ టీవీతో మాట్లాడిన ఆ పార్టీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఖచ్చితంగా కోర్టుకు వెళతామని అన్నారు.
0 comments:
Post a comment