అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రోజురోజుకీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. తాజాగా పంచాయతీ ఎన్నికల ప్రకటనపై రాష్ట్ర సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
0 Comments:
Post a Comment