ఆంధ్రప్రదేశ్ కొత్త ఓటర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్‌ఈసీ) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 జనవరి 15వ తేదీ నాటికి నాలుగు కోట్ల నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బెయ్ ఎనిమిది (4,04,41, 378 )మంది ఓటర్లుగా నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో ని 175 నియోజకవర్గాల్లో కొత్తగా విడుదల చేసిన ఎన్నికల జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 2,04,71,506 మంది కాగా ,పురుష ఓటర్ల సంఖ్య 1,99,66,173 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.ఇతరులు ( థర్డ్ జెండర్లు ) 4,135 మంది ఉన్నట్లు, అలాగే కొత్తగా 4,25,860 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సర్వీస్ ఓటర్లుగా 4,25,860 మంది నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
1.Select your District
2.Select your Assembly Constitution
3. Select your Polling station
0 Comments:
Post a Comment