AP JAC:
ఈరోజు ఏపీ జేఏసి పక్షాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగినది.
ముఖ్యమంత్రి గారితో చర్చించిన ప్రధానాంశాలు:
1. పి ఆర్ సి ను వెంటనే అమలు చేయాలని కోరారు.
2. సి పి ఎస్ ను రద్దు చేయాలని కోరగా, అధికారులతో ఇప్పటికే కమిటీ వేశామని, వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఎంత మేరకు చేయగలమో పూర్తిగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరడమైనది.
3. కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయాలని కోరగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు దరిమిలా చేయలేకపోతున్నామని దాని అమెండ్మెంట్ వచ్చిన వెంటనే చేస్తామని తెలిపారు.
4. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
5. క్లాస్-4 ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా ఉంచాలని అమెండ్మెంట్ ను కోరారు.
6. మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల స్పెషల్ సీఎల్ లను ఇవ్వాలని కోరారు.
7. మోడల్ స్కూల్ వారికి పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని కోరడమైనది.
8. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని కోరడమైనది.
ముఖ్యమంత్రి గారు పై విషయాలు అన్నింటిపై సానుకూలంగా స్పందించి త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి వీటిపై చర్యలు గైకొంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో *జెఎసి చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, కో చైర్మన్ పి బాబు రెడ్డి, జి హృదయ రాజు వైస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ బండి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు ఎమ్.రఘునాధ రెడ్డి, ఆర్టీసీ* నాయకులు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అన్ని సంఘాల డైరీలను, క్యాలెండర్లను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడమైనది.
0 Comments:
Post a Comment