Andhra Pradesh: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా APSSDC నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. నెల్లూరు జిల్లాలోని నాయిడుపేటలోని గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Greentech Industries India Pvt Ltd) కంపెనీలో ఉద్యోగ నియామకాల కోసం తాజాగాప్రకటన విడుదల చేశారు. తాజా నియామకాల ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 1లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Foundry డిపార్ట్మెంట్ లో 50 ట్రైనీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
టెన్త్/ఇంటర్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు 18-30 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నారు.
Machine Shop- ఈ డిపార్ట్మెంట్లో 50 ట్రైనీ ఆపరేటర్, 50 డిప్లొమో ట్రైనీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ట్రైనీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ/డిగ్రీ చేసి ఉండాలి. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల వేతనం ఉంటుంది. డిప్లొమో ట్రైనీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు డిప్లొమో చేసి ఉండాలి. వయస్సు 20-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11,500 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50-80కేజీల బరువు ఉండాలి. ఎత్తు 5 ఫీట్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అటెండెన్స్ బోనస్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుంది. కంపెనీ ఉచితంగా ఫుడ్ కూడా అందించనుంది.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-జిల్లా స్కిల్ డవలప్మెంట్ అధికారి ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
-అనంతరం అభ్యర్థులకు Greentech Industries India Pvt Ltd కంపెనీలో వారం పాటు శిక్షణ ఉంటుంది.
-విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు Greentech Industries India Pvt Ltd కంపెనీలో ఉద్యోగం కల్పించబడుతుంది.
Registration-Direct Link
Deploma+B.Tech, B.Tech అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 8639835953, 7780289591 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
0 comments:
Post a comment