Andhra Pradesh: జగన్ వర్సెస్ నిమ్మగడ్డ... ఏపీ ఎస్ఈసీ సెక్రటరీ తొలగింపు
ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. తాజాగా ఎలక్షన్ కమీషన్ సెక్రటరీ గా వాణీ మోహన్ తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాణీ మోహన్ సేవలు అవసరం లేదని సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వాణీ మోహన్ రిలీవ్ చేశారు. నిన్న ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసిన మరుసటి రోజు రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆ తరువాత ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
0 Comments:
Post a Comment