JEE Advanced 2021 Exam in July
దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష-2021 తేదీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ పరీక్ష జులై 3న నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈసారి ఐఐటీ ఖరగ్పూర్ పరీక్షను నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ఈ రోజు సాయంత్రం వర్చువల్ విధానంలో మాట్లాడిన ఆయన.. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు, సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ప్రారంభం, ముగింపు తేదీలను ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు 75శాతం మార్కులు తప్పనిసరి నిబంధనను ఈసారి కూడా సడలిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఈ నిబంధనను సడలించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a comment