80సీ ఒక్కటే కాదు.. పన్ను ఆదా ఇలా చేయండి
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తర్వాత తొలిసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సగటు వేతన జీవి ఆదాయ పన్ను మినహాయింపుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు పన్ను ఆదా చేసుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో ఉన్న సెక్షన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా మందికి తెలిసింది 80సీ ఒక్కటే. దీని కింద ఉన్న 80సీ, 80 సీసీసీ, 80 సీసీడీ (1) మొత్తం కలిపి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకే అనుమతిస్తారు. అయితే ఇవే కాకుండా పన్ను ఆదా కోసం మరికొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి.
1. సెక్షన్ 80డీ
ఈ సెక్షన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం రూ.25 వేల వరకూ క్లెయిమ చేసుకోవచ్చు.
ఈ డిడక్షన్‌ను సెల్ఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు జీవిత భాగస్వామి, పిల్లల పేరు మీద తీసుకున్న బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇక 60 ఏళ్ల లోపు ఉన్న తల్లిదండ్రుల కోసం మరో రూ.25 వేల వరకూ డిడక్షన్ క్లెయిమ్ చేసే వీలుంటుంది. 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ కోసం రూ. లక్ష వరకూ క్లెయిమ్ చేసుకునే వీలుండటం విశేషం.
2. సెక్షన్ 80డీడీ
మీపై ఆధారపడిన దివ్యాంగుల కోసం చేసే ఖర్చుపై.. ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 80 శాతంలోపు వైకల్యం ఉన్న వారిపై రూ.75 వేల వరకు, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారిపై రూ.1.25 లక్షల వరకూ క్లెయిమ్ చేసుకునే వీలుంది.
3. సెక్షన్ 80ఇ
ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటే.. దానిపై చెల్లించే వడ్డీపై ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ఠంగా 8 ఏళ్ల వరకూ ఈ క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. డిడక్షన్‌కు పరిమితి ఏమీ లేదు.
4. సెక్షన్ 80ఇఇ
ఈ సెక్షన్ కింద హోమ్ లోన్‌పై కట్టే వడ్డీ మీద క్లెయిమ్ పొందవచ్చు. ఇది కేవలం వ్యక్తులకే తప్ప హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ, సంస్థలకు వర్తించదు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద ఉన్న రూ.2 లక్షలే కాకుండా ఈ సెక్షన్ 80ఇఇ కింద మరో రూ.50 వేలు క్లెయిమ్ పొందే వీలుంది.
5. సెక్షన్ 80జీ
ప్రభుత్వం గుర్తించిన చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాలపై ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.
6. సెక్షన్ 80జీజీ
హెచ్ఆర్ఏ లేని ఉద్యోగులు తాము చెల్లించే ఇంటి కిరాయి మీద ఈ సెక్షన్ కింద క్లెయిమ్ పొందవచ్చు.
0 comments:
Post a comment