తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ నివేదించిన అంశాల్లోనివే ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత... వచ్చిన మొదటి పీఆర్సీ కమిటీలో చోటుచేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సీపీయస్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదరులు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు, సర్వీస్ లో మరణించిన/ డిస్మిస్ అయిన ఉద్యోగులకు... ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలంటూ సిఫారసు చేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.
సంఘం నేతలు బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక... పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగుల మాదిరిగానే...
సీపీఎస్ ఉద్యోగులు పదవీవిరమణ చేసిన తర్వాత వచ్చే మెడికల్ రీ ఇంబర్స్మెంట్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం సౌకర్యాలను వర్తింపజేసిన నేపధ్యంలో... ఇప్పటివరకు రిటైరైన రెండు వేల మంది ఉద్యోగులు సహా మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిందని స్థితప్రజ్ఞ, శ్రీకాంత్ పేర్కొన్నారు.
సీపీఎస్ పథకానికి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను 14 శాతానికి పెంచడంవల్ల... ప్రభుత్వ సొమ్ము మరింతగా షేర్ మార్కెట్ కు తరలిపోతుందని స్థితప్రజ్ఞ, శ్రీకాంత్ వాపోయారు. ఈ విషయమై ముఖ్యమంత్రి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a comment