💁♀️ఇంజినీరింగ్లో 72.77 శాతం సీట్ల భర్తీ..
🔰ముగిసిన మొదటి విడత కౌన్సెలింగ్..
🍁ఈనాడు, అమరావతి:
🔰ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్లో 72.77శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో 99,688 సీట్లు ఉండగా.. 72,549 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ సీట్ల కౌన్సెలింగ్ ఆదివారం ముగిసింది. ఐచ్ఛికాలు ఇచ్చిన వారికి సీట్ల కేటాయింపు పూర్తిచేశారు. ప్రభుత్వ, ప్రైవేటులోని 261 కళాశాలల్లో 27,139 సీట్లు మిగిలిపోయాయి. క్రీడా కోటా 465 సీట్ల కేటాయింపు వాయిదా వేశారు. క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ధ్రువపత్రాల పరిశీలన పూర్తికానందున వీరికి సీట్ల కేటాయింపు చేయలేదని కన్వీనర్ ఎం.ఎం.నాయక్ వెల్లడించారు.
🔹 రాష్ట్రంలోని 25 ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న 6,009 సీట్లలో 5,649 సీట్లు భర్తీ అయ్యాయి.
🔹 ప్రైవేటులో 236 విద్యా సంస్థల్లో 93,679 సీట్లు ఉండగా.. 66,900 సీట్లు నిండాయి.
🔹 ఎంపీసీ స్ట్రీమ్ ఫార్మసీలో 4,078సీట్లు ఉండగా ఇందులో 318 సీట్లు(7.79శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.
🔹 ప్రైవేటులో ఫార్మసీ సీట్లు 3,794 ఉండగా కేవలం 241 సీట్లు మాత్రమే నిండాయి.
🔰కౌన్సెలింగ్ ఇలా...
🔹 ఎంసెట్లో అర్హత సాధించినవారు: 1,29,714
🔹కౌన్సెలింగ్కు నమోదు చేసుకున్నవారు: 90,076
🔹 ధ్రువపత్రాల పరిశీలన తర్వాత అర్హత సాధించినవారు: 89,078
🔹 కళాశాలలు, కోర్సుల ఎంపికక ఐచ్ఛికాలు ఇచ్చినవారు: 83,014
🔹 సీట్ల భర్తీ: 72,867
🍁54 కళాశాలల్లోనే 100శాతం భర్తీ..
🔰రాష్ట్రంలోని 54 కళాశాలల్లో మాత్రమే 100శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బీ ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలలు 380 ఉండగా.. 100లోపు సీట్లు భర్తీ అయిన కళాశాలలు 72 ఉన్నాయి. 50 మంది ప్రవేశాలు పొందిన విద్యాసంస్థలు 43 ఉండగా.. 25లోపు సీట్లు భర్తీ అయినవి 19కళాశాలలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్లో అత్యధికంగా 93.95శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 22,672 సీట్లు ఉండగా.. 21,300 నిండాయి. ఈసీఈలో 80.59శాతం భర్తీ అయ్యాయి. 23,532 సీట్లు ఉండగా.. 18,964మంది ప్రవేశాలు పొందారు
0 comments:
Post a comment