దటీజ్ భారత్..! ఏకంగా 60 దేశాలకు కరోనా టీకా సరఫరా...!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపంతా భారత్‌పైనే! కరోనా సంక్షోభం నుంచి గట్టేక్కించే టీకాల తయారీ కోసం అనేక దేశాలు భారత్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. అయితే..ఈ విషయమై వివిధ దేశాల నుంచి భారత్‌కు అందుతున్న విజ్ఞప్తులను చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ఇక భారతీయుల మనసులైతే గర్వంతో ఉప్పొంగుతాయి. తాజా గణాంకాల ప్రకారం..కరోనా టీకాలు ఎగుమతి చేసేందుకు మనదేశం ఏకంగా 16 కోట్ల డోసులను సిద్ధం చేస్తోంది. మార్చి నాటికల్లా 60 దేశాలతో పాటూ యూనిసెఫ్‌కు ఈ టీకాలను అందించేలా గొప్ప లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుంది. అయితే..ఇందులో దాదాపు 10 లక్షల టీకాలను పొరుగు దేశాలకు ఇచ్చేందుకు భారత్ నిర్ణయించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
ప్రపంచంలోని దాదాపు పావు శాతం జానాభాకు నిలయమైన 60 దేశాలు భారత్‌కు అధికార, అనధికార మార్గాల్లో60 దేశాలు విజ్ఞప్తులు పంపించాయని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే..సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకూ 11 దేశాలకు 1.45 కోట్ల టీకా డోసులను ఎగుమతి చేసినట్టు తెలుస్తోంది. పొరుగు దేశాలతో పాటూ బ్రెజీల్, మొరొక్కో వంటి సుదూర దేశాలకు కూడా వాణిజ్య ఒప్పందాలకు కింద ఆక్సఫర్డ్ టీకా సరఫరా జరుగుతుందని తెలుస్తోంది. ఈ నెలాఖరు కల్లా 33 మిలియన్ డోసులను ఎగుమతి చేయాలనే లక్ష్యాన్ని విదేశాంగ శాఖ నిర్దేశించుకుంది.
'కరోనా టీకాలను సరఫరా చేయాలంటూ ఇప్పటవరకూ 30 దేశాల భారత్‌ను అధికారికంగా సంప్రదించాయి. మరో 30 దేశాలు మౌఖికంగా కోరాయి. ఇక ఆఫ్ఘానిస్థాన్ వంటి దేశాలకు సహాయపడేందుకు భారత్‌యే స్వయంగా ముందుకు వచ్చింది. ఒక్క ఆఫ్రికాకే 10 మిలియన్ డోసులను పంపింద్దామనుకుంటున్నాం' అని ప్రభుత్వ ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి చీఫ్ భారత్‌ను ఉద్దేశించి చేసిన ప్రకటన చూస్తే.. కరోనా టీకాల విషయంలో భారత్‌పై ప్రపంచం ఎంత ఆశపెట్టుకున్నదీ ఇట్టే అర్థమైపోతుంది. భారత్ అంటే ప్రపంచానికున్న అద్భుతమైన ఆస్తి అని ఆయన అభివర్ణించారు. అందుకుతగ్గట్టుగానే భారత్ ఈ గురుత భాధ్యతను తన భూజానవేసుకుంది. కరోనా సంక్షోభాన్ని అధికమించేందుకు ప్రపంచపు ఫార్మసీ(భారత్)పై మీరు నమ్మకముంచండి..అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం! నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రస్తుతం భారత్ ముమ్మర ప్రయత్నాల్లో తలమునకలై ఉంది.
0 comments:
Post a comment