హైదరాబాద్: టెలికం రంగంలోకి జియో రాకతో 4జీ నెట్‌వర్క్‌లో మొదలైన పోటీ ఇప్పుడు 5జీకి పాకింది. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి 5జీని తీసుకురాబోతున్నట్టు రిలయన్స్ జియో గతేడాది డిసెంబరులో ప్రకటించగా, ఇప్పుడు ఎయిర్టెల్ ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా 5జీని ప్రదర్శించి చూపించింది. నేడు హైదరాబాద్‌లో వాణిజ్య నెట్‌వర్క్‌పై డెమో ఇచ్చింది. నాన్-స్టాండ్ఎలోన్ (ఎన్ఎస్ఏ) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌పై 5జీ, 4జీ ని లైవ్‌లో సమాంతరంగా పనిచేయించి చూపించింది.
ఎయిర్టెల్ 5జీ వేగం ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ టెక్నాలజీస్ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఓ పూర్తిస్థాయి సినిమాను 5జీ ఫోన్లలో సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ) కనుక అనుమతి ఇస్తే 5జీ, 4జీ నెట్‌వర్క్‌ను ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్ నుంచి ఆపరేట్ చేస్తామని ఎయిర్టెల్ పేర్కొంది. అంతేకాదు, కొన్ని నెలల్లోనే 5జీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే, వాణిజ్యపరంగా 5జీని దేశవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చేది కచ్చితంగా చెప్పలేదు.
5జీ డెమో కోసం ఎయిర్టెల్.. 'ఒప్పో రెనో 5 ప్రొ', 'ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రొ' స్మార్ట్ఫోన్లను వినియోగించింది. దేశంలో అందుబాటులో ఉన్న దాదాపు 20 5జీ ఫోన్ల కోసం ఇప్పుడు ఎయిర్టెల్ 5జీ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం 5జీ ఫోన్లు కలిగిన వారు తమ సిమ్‌కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోకుండానే 5జీ అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది.
5జీ... స్మారటే.
ReplyDelete