ఏపీలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. రేపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సిద్ధమవుతున్న ఎస్ఈసీ.. ఇందుకోసం పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. మధ్యాహ్నం మూడు గంటలకు తమతో సమావేశం కావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరాజ శంకర్‌ను కోరింది. అయితే వారు ఈ సమావేశానికి రాలేదు. దీంతో వారిపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌గా పరిగణించారు. చివరి అవకాశంగా సాయంత్రం 5 గంటలకు తన ముందు హాజరుకావాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి మెమో జారీ చేసింది. ఐదు గంటల తరువాత కూడా వారు రాకపోతే ఏం చేయాలనే దానిపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాలోచనలు జరుపుతున్నారు.
మరోవైపు ఈ ఇద్దరు అధికారులు ఉదయమే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. దీంతో వీరిద్దరూ ఎస్ఈసీతో సమావేశానికి హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తాను చెప్పిన 5 గంటలకు తనతో సమావేశానికి అధికారులు హాజరుకాకపోతే ఎస్ఈసీ వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది.
0 comments:
Post a comment