బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు.
జనవరి 2న రాష్ట్రంలోని పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో 50 మందికి పైగా ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయులే కాకుండా, నలుగురు విద్యార్థులు కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో కోవిడ్ -19కు సంక్రమించారు. ఈ ఉపాధ్యాయులు పని చేసే పాఠశాలలను మూడు రోజులపాటు మూసివేసినట్లు విద్యా శాఖ అధికారి తెలిపారు.
0 Comments:
Post a Comment