🔳డీఎడ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు నిల్
354 కళాశాలలకు నోటీసులు
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని చాలా డీఎడ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు లేవు. కొన్నింటిలో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. మొత్తం 354 కాలేజీలకు పత్రాల పరిశీలనకు రావాలని నోటీసులు ఇచ్చాం. కేవలం 99 కళాశాలలు మాత్రమే వచ్చాయి. వీటిలో 11 స్వచ్ఛందంగా మూసివేతకు అనుమతి కోరాయి. మరో 18... ప్రమాణాలు పాటించకపోవడంవల్ల మూసివేతకు సిఫార్సు చేస్తున్నాం’’ అని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. పత్రాలు సమర్పించిన కాలేజీల్లో ఏవోకొన్ని తప్పించి చాలావరకూ కనీస ప్రమాణాలు పాటించడం లేదని మండిపడ్డారు. డాక్యుమెంట్ల పరిశీలనకు హాజరు కాని కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులకు స్పందించని కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు.
0 Comments:
Post a Comment