ఒక్కో విడతలో 3,000-3,500
పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అంచనా
కలెక్టర్లతో త్వరలో వీడియో సమావేశం
☀️ఈనాడు, అమరావతి: ఒక్కో విడతలో ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు, మూడు రోజుల్లో కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించనుంది. 3,000 నుంచి 3,500 పంచాయతీలకు ఒక విడత చొప్పున ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, జడ్పీ సీఈవో, డీపీవోలతో సమావేశం తర్వాత వీటిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కోర్టు కేసులు, వివాదాల్లేని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 13,371 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలనుకున్న సమయానికి వీటి సంఖ్య 13,365. ఎన్నికలు వాయిదా వేశాక కొన్ని పంచాయతీలను విభజించి, కొన్నింటిని నగర పంచాయతీలుగా మార్చారు.
0 comments:
Post a comment