🌼‘11న అమ్మఒడి సొమ్ము జమ
☀️ఇళ్లపట్టాల పంపిణీ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
☀️ఈ మేరకు అమరావతి నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు.
☀️సచివాలయాల్లో పథకాలకు సంబంధించిన బోర్డులు ఉండాలన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలన్నారు.
☀️ప్రతి గ్రామంలోనూ జనతా బజారు, ఆంగ్లమాధ్యమం పాఠశాల అందుబాటులో ఉండాలని చెప్పారు.
☀️జనవరి 11న అమ్మఒడి సొమ్ము ఖాతాల్లో జమ చేస్తామని, ఫిబ్రవరి ఒకటి నుంచి నాణ్యమైన బియ్యం ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
0 comments:
Post a comment