🔳మండల విద్యాధికారి కార్యాలయంలోనే ఐచ్ఛికాల నమోదు
సర్వర్ సమస్యతో ఉపాధ్యాయ బదిలీల్లో మార్పు
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల ఆన్‌లైన్ బదిలీ ప్రక్రియలో సర్వర్ సమస్య తలెత్తింది. దీంతో పాఠశాల విద్యాశాఖ బదిలీల ప్రక్రియను మండల విద్యాధికారులకు అప్పగించింది. ఇప్పటి వరకు అసలు ఐచ్ఛికాలు ఇవ్వని వారు ఈ నెల 21, 22 తేదీల్లో మండల విద్యాధికారి కార్యాలయంలో ఐచ్ఛికాలు ఇవ్వాలని సూచించింది. కొన్నింటికే ఐచ్ఛికాలు ఇచ్చిన వారు ఈ నెల 23 నుంచి 31 వరకు సబ్మిట్ చేసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐచ్ఛికాలకు అవకాశం ఉన్నా.. ఉదయం నుంచే సర్వర్ సమస్య తలెత్తడంతో ఉపాధ్యాయులు ఐచ్ఛికాల నమోదు, సవరణలు చేసుకోలేకపోయారు. దీంతో బదిలీ ప్రక్రియను మండల విద్యాధికారి కార్యాలయానికి మార్పు చేశారు. ఇటీవల సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24కు బదిలీ ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. సర్వర్ సమస్యతో ఇది జనవరి వరకు కొనసాగనుంది.
0 Comments:
Post a Comment