🌸 ఆన్ లైన్ కౌన్సెలింగ్ కే అన్ని జిల్లాల డీఈవో లు, ఇతర విద్యాశాఖ సిబ్బంది మొగ్గు చూపినట్లు సమాచారం..
★ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్..
*ఆన్లైన్ కౌన్సెలింగ్ కే మొగ్గు..!*
అనంతపురం: ఉపాధ్యాయుల బదిలీల్లో ఆన్లైన్ కౌన్సెలింగ్ కే అన్ని జిల్లాల డీఈఓలు, ఇతర విద్యాశాఖ సిబ్బంది మొగ్గు చూపినట్లు సమాచారం. సోమవారం' కమిషనర్ చినవీరభద్రుడు, సర్వీసెస్ జేడీ దేవానంద్ అన్ని జిల్లాల డీఈఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని సైన్స్ సెంటర్ నుంచి డీఈఓ శామ్యూల్, ఏడీ రవూఫ్, ఇతర సూపరింటెండెంట్లు హాజరయ్యారు. కమిషనర్ బదిలీలు, ప్లేసుల బ్లాక్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత బదిలీల కౌన్సెలింగ్ మాన్యువల్ గానా, ఆన్ లైన్ ద్వారా నిర్వహిద్దామా అన్న అంశంపై డీఈఓలు, ఇతర అధికారులు అభిప్రాయం కోరారు. మెజారిటీ డీఈఓలు, అధికారులు ఆన్లైన్ కౌన్సెలింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో సూపరిం టెండెంట్ శ్రీనాథ్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పార్థసారథి, పెద్దయ్య, ప్రదీప్, చక్రి, అమర్ నాథ్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
0 comments:
Post a comment