ఎవరికీ కనిపించకుండా..!
ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేసిన అధికారులు
వ్యతిరేకిస్తున్న సంఘాలు.
శ్రీకాకుళం విద్యావిభాగం, న్యూస్‌టుడే:
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆది నుంచి గందరగోళంగానే సాగుతోంది. మొన్నటి వరకూ ప్రభుత్వ తీరుపై సంఘాలు తీవ్రంగా మండిపడుతూ వచ్చాయి. ఒక దశలో ఆందోళన తీవ్రతరం చేసేందుకు నిర్ణయించాయి. చివరికి వారితో చర్చలు జరపడంతో ఆందోళనకు తాత్కాలికంగా వెనక్కి తగ్గాయి. తాజాగా ఉన్న ఖాళీలను బ్లాక్ చేయడంతో గురువులంతా ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎంఈవోల నుంచి జిల్లా విద్యాశాఖ సమాచారాన్ని సేకరించింది. దీనిని క్రోడీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఖాళీలను బ్లాక్ చేయడంతో బదిలీల్లో రాజకీయాలకు తెరలేచే అవకాశముందని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని, అన్ని ఖాళీలను చూపించాలని సంఘాలు డిమాండు చేస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్థాన చలనం కోసం 5432 మంది ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తు వచ్చాయి. ఇందులో తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు 2109 మంది ఉండగా, 3,324 మంది రిక్వెస్టు పెట్టుకున్నారు. మొత్తం ఖాళీలను 3400 వరకు ఉన్నాయి. అయితే తాజాగా
🎯విద్యాశాఖ అధికారులు 700లకు పైగా ఖాళీలను బ్లాక్ చేశారు.
ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🎯గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
‘ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌లో అన్ని ఖాళీలను తప్పనిసరిగా చూపించాలి. బ్లాక్ చేసే విధానంతో కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత డిప్యూటేషన్ పేరుతో వారికి అనుకూలమైన బదిలీలు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఐచ్ఛికాలను ఎంచుకునేందుకు కష్టంగా ఉంటుంది’ అని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్మోహన్ పేర్కొన్నారు. ‘ఖాళీలను నిలిపివేయడంతో వారంతా నష్టపోతారు. చాలా బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయి. ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసి బలవంతంగా అధికారులు చూపించిన ఖాళీలను కోరుకోమనడం గతంలో ఎప్పుడూ జరగలేదు.’ అని యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు.
0 comments:
Post a comment