How to open a postal FD account?
పోస్టల్ ఎఫ్‌డీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
కస్టమర్లు చెక్ లేదా క్యాష్ ద్వారా పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ ఎఫ్‌డీ అకౌంట్‌ను చెక్ ద్వారా ఓపెన్ చేస్తే.. ఆ డబ్బు ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ అయిన రోజును ఎఫ్‌డీ ఖాతా తెరిచిన తేదీగా పరిగణిస్తారు. కనీసం రూ.1000తో ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పరిమితి లేకుండా ఎంతమొత్తాన్నైనా పోస్టాఫీస్ ఎఫ్‌డీలో డిపాజిట్ చేసుకోవచ్చు.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
పోస్టాఫీసులో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు చేసే ఎఫ్‌డీలపై 5.50 నుంచి 6.70 శాతం వడ్డీ రేట్లు పొందవచ్చు. ఐదేళ్ల ఎఫ్‌డీపై అత్యధికంగా 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.
ఎఫ్‌డీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు
ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఎఫ్‌డీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీరు ఉండే ప్రాంతంలోని పోస్టాఫీసుకు ఎఫ్‌డీ అకౌంట్‌ను సులభంగా మార్చుకోవచ్చు. ఉద్యోగాలకోసం వివిధ ప్రాంతాలకు మారేవారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
ఇతర మార్పులు కూడా.
పోస్టాఫీస్ లో కస్టమర్లు తీసుకునే పర్సనల్ ఎఫ్‌డీ అకౌంట్ను జాయింట్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఒకవేళ ఇంతకు ముందే జాయింట్ ఎఫ్‌డీ అకౌంట్ ఉంటే, దాన్ని మళ్లీ సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.
నామినీని కూడా మార్చుకోవచ్చు
పోస్టాఫీస్ ఎఫ్‌డీల్లో నామినీకి సంబంధించిన మార్పులను సులభంగా చేసుకోవచ్చు. కొత్తగా నామినీని చేర్చడానికి, మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వినియోగదారులు నామినీని యాడ్ చేసుకోవచ్చు. మైనర్ కూడా ఎఫ్‌డీ ఖాతా తెరవవచ్చు. మేజర్‌గా మారిన తరువాత తన పేరు మీదకు అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు
0 Comments:
Post a Comment