DRDO Recruitment 2020: నిరుద్యోగులకు DRDO శుభవార్త.. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు
నిరుద్యోగులకు DRDO శుభవార్త చెప్పింది. సంస్థకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబరేటరీ(SSPL)లో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 70 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తుకు డిసెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
డిప్లొమా(మెకానికల్ ఇంజనీరింగ్)-10 పోస్టులు
డిప్లొమో(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)-10
డిప్లొమో(ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)-10
డిప్లొమో(కంప్యూటర్ ఇంజినీరింగ్)-15 పోస్టులు
డిప్లొమో ఎంఓపీ(ఇంగ్లిష్, హిందీ)-15డిప్లొమో(లైబ్రరీ సైన్స్)-10
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ, లేదా ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 8 వేలు ఉపకార వేతనం చెల్లించనున్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండనే అభ్యర్థులను ఎంపిక నిర్వహించనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
0 comments:
Post a comment