రూ.7.4 కోట్లు గెలిచాడు.. సగం ఇచ్చేశాడు...
ప్రతి ఏడాది వార్కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కే ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ టీచర్‌కు పది లక్షల డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఈ ఏడాది గ్లోబల్ టీచర్ ప్రైజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది టీచర్లు నామినేట్ అయ్యారు. ప్రైజ్ ప్రకటించాల్సి ఇవాళే. కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. చివరి రౌండ్లో పది మంది నిలిచారు. స్టీఫెన్ ఫ్రై విజేతను ప్రకటించే బాధ్యత తీసుకున్నారు. టాప్ టెన్ నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత్ సింగ్ దిసాలేకు ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్ తన పేరు రాగానే దిసాలే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతనికి పది లక్షల డాలర్లు అంటే రూ. 7.4 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇంతలోనే జడ్జీలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో దిసాలే ఓ అద్భుత నిర్ణయం ప్రకటించారు.
టీచర్ అంటే 'ఇచ్చేవాడు, పంచేవాడు' అంటూ తనకు వచ్చిన ప్రైజ్ మనీలో సగం మొత్తం టాప్ టెన్‌లోని మిగిలిన 9 మందికి ఇస్తున్నట్లు ప్రకటించారు. 32 ఏళ్ళ దిసాలే మహారాష్ట్రలోని పరితేవాడి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. వెనుబడిన తరగతులకు చెందిన అమ్మాయిలకు విద్యను అందిస్తున్నాడు. దాదాపు 83 దేశాల పిల్లలకు దిసాలే సైన్స్ పాఠాలు చెబుతున్నారు.
What a great performance and also great humanity.
ReplyDelete