Railway Jobs 2021: రైల్వేలో 1004 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
భారతీయ రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1004 ఖాళీలను ప్రకటించింది. అప్రెంటీస్ పోస్టులు ఇవి. హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC వెబ్‌సైట్ https://www.rrchubli.in/ లో దరఖాస్తు లింక్ ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 9 లోగా అప్లై చేయాలి. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 1004
హుబ్లీ డివిజన్- 287
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ- 217బెంగళూరు డివిజన్- 280
మైసూరు డివిజన్- 177
సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు- 43
మొత్తం ఖాళీలు- 1004
ఫిట్టర్- 335
ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117
ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37
ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17
వెల్డర్- 55
మెషినిస్ట్- 13
టర్నర్- 13
ఎలక్ట్రీషియన్- 231
కార్పెంటర్- 11
పెయింటర్- 18
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)- 138
స్టెనోగ్రాఫర్- 2
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 9
శిక్షణా కాలం- 1 ఏడాది
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు- రూ.100.
0 Comments:
Post a Comment