NPCIL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. NPCILలో అప్రెంటీస్ పోస్టులు..
నిరుద్యోగులకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) శుభవార్త చెప్పింది. దాదాపు 65 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం స్కాలర్ షిప్ అందించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫిట్టర్, Machinist, Draughtsman, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్లికేషన్లను సబ్మిట్ చేయడానికి జనవరి 11ని గడువుగా నిర్ణయించారు. ట్రైనింగ్ పిరియడ్ ఏడాది పాటు ఉంటుంది. ఐటీఐలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు.
పదో తరగతితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 16-24 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. వయో పరిమితి సడలింపుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు దరఖాస్తుకు అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Apply Online ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శుభవార్త చెప్పింది. SYNERGIES CASTINGS Ltd సంస్థతో కలిసి నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దాదాపు 250 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైనీ, ఆపరేటర్ ఆపరేటర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 18-35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను ఈ నెల 14, 15న నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొదట అభ్యర్థులు APSSDC వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ లోని కంపెనీలో ఒక నెల పాటు ట్రైనింగ్ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగం కల్పించబడుతుంది. శిక్షణ సమయంలో ఉచితంగా భోజనం, వసతి సదుపాయం కల్పించబడుతుంది. ఏమైనా సందేహాలుంటే 9133203064 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment