☀️NMMS
🌼ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
🎯ప్రతిభ గల పేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో (వసతి గృహం సదుపాయం లేని) చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు జాతీయ ప్రతిభ పాఠవ ఉపకార వేతనం. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఏటా నిర్వహిస్తోంది.
☀️ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తోంది.
🍁దరఖాస్తు ఇలా..
🎯అంతర్జాలంతో www.bseap.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. పాఠశాల డైస్ కోడ్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తులో విద్యార్థి పూర్తి వివరాలను ప్రధానోపాధ్యాయుల సమక్షంలో నమోదు చేసుకోవాలి..
☀️అందులోనే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ.50 ఫీజు ఎస్బీఐలో చెల్లిస్తే దరఖాస్తు సమర్పణ పూర్తవుతోంది.
🎯తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 90 మార్కులకు మెంటల్ ఎబిలిటీ, మరో 90 మార్కులకు ఏడు, ఎనిమిది తరగతుల గణితం, సైన్స్, సాంఘిక సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మూడు గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రం అంతా బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది.
☀️పరీక్ష తేదీ: ఫిబ్రవరి 14-2021
🎯దరఖాస్తుకు ఆఖరు తేదీ : డిసెంబరు 9
☀️పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : డిసెంబరు 10
0 comments:
Post a comment