ఇండియాలోకెల్లా అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను హెచ్చరించింది. అలా చేస్తే చిక్కుల్లో పడతారని..అప్రమత్తంగా ఉండాలని కోరింది. కొంత మంది ఎల్ఐసీ పేరుతో చీట్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ అధికారులు, ఐఆర్డీఏఐ అధికారులు, ఈసీఐ అధికారులు అని చెప్పుకుంటూ కొందరు ఎల్ఐసీ పాలసీదారులను చీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. పాలసీకి సంబంధించిన ఎటువంటి వివరాలనైనా ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయదని తేల్చి చెప్పింది. అంతేకాదు..పాలసీలను మానుకోమని లేదంటే నిలిపివేయాలని ఎట్టి పరిస్థితుల్లో కోరదని స్పష్టం చేసింది.
ఈ హెచ్చిరికలతో పాటు ఎల్ఐసీ మరికొన్ని సూచనలు కూడా చేసింది.
పాలసీకి సంబంధించి ఏవైనా వివరాలు తెలుసుకోవాలంటే ఎల్ఐసీ వెబ్సైట్ లేదా దగ్గరిలోని ఎల్ఐసీ బ్రాంచు వెళ్తే సమాచారం దొరకుతుందని పేర్కొంది. ఎవరైనా ఎల్ఐసీ నుంచి కాల్స్ చేస్తున్నామని చెప్తే..నమ్మవద్దని సూచించింది. పాలసీ హోల్డర్స్కు ఎవరైనా మోసపూరిత కాల్స్ చేస్తే spuriouscalls@licindia.comకు మెయిల్ చేయాలని కోరింది.
0 comments:
Post a comment