Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 20 December 2020

LIC Scholarship: విద్యార్థులకు శుభవార్త... స్కాలర్‌షిప్ ప్రకటించిన ఎల్ఐసీ.. ఇలా అప్లై చేయండి

 LIC Scholarship: విద్యార్థులకు శుభవార్త... స్కాలర్‌షిప్ ప్రకటించిన ఎల్ఐసీ.. ఇలా అప్లై చేయండి...


ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు శుభవార్త. భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 స్కీమ్ ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 కి దరఖాస్తు చేయొచ్చు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసీ స్కాలర్‌షిప్ లక్ష్యం. భారతదేశంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నవారు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు. ఐటీఐలో టెక్నికల్, వొకేషనల్ కోర్సులు చదివేవారు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. మరి ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 వివరాలు పూర్తిగా తెలుసుకోండి.


CBSE Board Exam 2021: బోర్డ్ ఎగ్జామ్స్‌పై క్లారిటీ ఇచ్చిన సీబీఎస్ఈ SBI Jobs 2020: ఎస్‌బీఐలో 8500 అప్రెంటీస్ జాబ్స్... డిగ్రీ పాసైనవారు అప్లై చేయండి ఇలా


ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్హతల వివరాలు చూస్తే 2019-20 విద్యాసంవత్సరంలో 12వ తరగతి లేదా ఇంటర్, 10వతరగతి పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000 దాటకూడదు. మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు. ఎల్ఐసీ ఇచ్చే స్కాలర్‌షిప్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. కోర్సు పూర్తి చేసే వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అండర్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేందుకు ప్రతీ ఏడాది రూ.20,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇక అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ అందిస్తోంది ఎల్ఐసీ. 10వ తరగతి పాసైన అమ్మాయిలు 10+2 చదివేందుకు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. 10వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షికాదాయం రూ.2,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. 10+2 చదివేందుకు ప్రతీ ఏటా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎంపికైన విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్థులు 50 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాలి. కోర్సులో ఫెయిల్ అయితే స్కాలర్‌షిప్ నిలిపివేస్తారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే వారి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలను తీసుకుంటుంది ఎల్ఐసీ. సదరు విద్యార్థి పేరు మీద ఉన్న క్యాన్సిల్డ్ చెక్ తప్పనిసరి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top