Kanyadan Policy: రోజుకు రూ. 121 చెల్లిస్తే మీ కూతురు పెళ్లికి రూ. 27 లక్షలు ఇవ్వనున్న LIC
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇవి రెండు అత్యంత కఠినమైన పనులు. ఇల్లు కట్టి పిల్లలందరికీ ఒక నీడనివ్వాలని... అలాగే కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని సగటు మధ్య తరగతి తండ్రి ఆలోచన. అందుకే ఎన్నెన్నో ప్రయత్నాలు. ఆ ఆలోచనలతోనే సావాసం చేస్తూ... పొద్దస్తమానం కష్టపడుతూ.. కూడబెట్టిన దాంతో కూతురు పెళ్లి ఘనంగా చేస్తారు. కానీ ఈ ప్రక్రియ అంత సులువైనదేమీ కాదు. ఈ రోజుల్లో అస్సలే కాదు. అందుకే ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ఒక బంపరాఫర్ ను ప్రకటించింది. కూతురున్న ప్రతి తండ్రికి ఇది ఒక సదావకాశం.
అవును.. ఎల్ఐసీ నిజంగానే బంపరాఫర్ ప్రకటించింది. ప్రతి తండ్రి తన కూతురు చదువు గురించి గానీ..
పెళ్లి గురించి గానీ చింత మానుకునేలా కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదేంటంటే.. ఎల్ఐసీ కన్యాధాన్ పాలసీ (LIC Kanyadan policy).. దీని ద్వారా తండ్రులకు బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి. మీ రోజూవారి సంపాధనలోంచి రోజుకు రూ. 121 చెల్లిస్తే చాలు.. పెళ్లినాటికి ఎల్ఐసీ మీకు రూ. 27 లక్షల రూపాయలు అందజేస్తుంది. వీలును బట్టి చెల్లించండి...
ఇది నాన్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. పాలసీ తీసుకున్న తర్వాత సదరు పాలసీదారుడు చనిపోతే.. నామినీకి బీమా డబ్బుల్లో ప్రతి ఏడాది పదిశాతం చొప్పున లభిస్తాయి. అదే పాలసీదారుడు ప్లాన్ మెచ్యూరిటీ తర్వాత కూడా జీవించి ఉంటే అప్పుడు పాలసీ డబ్బులను, బోనస్‌తో కలిపి అందజేస్తారు. కనీసం లక్ష రూపాయల మొత్తానికి ఈ ప్లాన్ ను తీసుకోవాలి. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఉంది. 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల కాలం పాటు పాలసీదారుడు ప్రీమియం చెల్లించాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. ఇలా పాలసీదారుడి వీలును బట్టి ప్రీమియం చెల్లించొచ్చు. మీరు ఎంచుకున్న టర్మ్ కంటే మూడేళ్లు తక్కువగానే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరు అర్హులు..?
ఈ పాలసీ తీసుకోవడానికి మీకు కనీసం 30 ఏళ్లు నిండి ఉండాలి. కుమార్తెకు కనీసం 1 ఏడాది పూర్తై ఉండాలి. పాలసీ వ్యవధి 25 ఏళ్లయినా.. 22 ఏళ్లే ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీని 25 ఏళ్లకు బదులుగా.. 13 ఏళ్లకు కూడా తీసుకోవచ్చు. కూతురు వివాహం కోసం కాకుండా చదువుకు కూడా వినియోగించుకోవచ్చు. ఇందులో బీమా మొత్తం ర. 10 లక్షలు. రూ. 12.25 లక్షలు బోనస్ కింద వస్తుంది. అడిషినల్ బోనస్ కింద ఎల్ఐసీ రూ. 4.5 లక్షలు అందిస్తుంది. మొత్తంగా పాలసీదారుడు రూ. 26.75 లక్షలు పొందొచ్చు.
పాలసీ తీసుకున్నాక పాలసీదారుడు మరణిస్తే.. అతని కుటుంబం ప్రీమియం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామినీకి రూ. 10 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. సాధారణ మరణమైతే రూ. 5 లక్షలు వస్తాయి. అంటే ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ కూడా ఉంది.
0 Comments:
Post a Comment