HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ చాలా సింపుల్... చేయండి ఇలా
మీరు హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం చాలా సింపుల్. టెక్నాలజీని ఉపయోగించుకొని గ్యాస్ బుకింగ్‌ను సులభతరం చేసింది హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్. హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఐవీఆర్ఎస్, వాట్సప్, ఎస్ఎంఎస్, ఆన్లైన్, యాప్... ఇలా వేర్వేరు పద్ధతుల్లో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.
IVRS: హెచ్‌పీ ఎనీటైమ్ పేరుతో 24 గంటలు పనిచేసే ఐవీఆర్ఎస్ సిస్టమ్ రూపొందించింది HPCL. ప్రాంతాలను బట్టి ఈ నెంబర్లు మారుతుంటాయి. మీరు ఐవీఆర్ఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ ప్రాంతానికి చెందిన హెచ్‌పీ బుకింగ్ నెంబర్ తెలుసుకోవాలి.
ఆ తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఐవీఆర్ఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.WhatsApp: వాట్సప్ హెల్ప్‌లైన్ సేవల్ని కూడా ప్రారంభించింది HPCL. వాట్సప్ నెంబర్ 92222201122 మీ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సప్ హెల్ప్‌లైన్ సేవల్ని పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే BOOK అని, ఇతర సాయం కావాలంటే HELP అని, గ్యాస్ లీకేజీ సమస్యలు ఉన్నట్టైతే LEAKAGE అని ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ పంపిస్తే చాలు. రిజిస్టర్డ్ మొబైల్ నుంచే ఈ మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
Online Portal: ఆన్లైన్ పోర్టల్ ద్వారా హెచ్‌పీ గ్యాస్ బుక్ చేయొచ్చు. మొదట ఆన్లైన్ పోర్టల్‌లో కస్టమర్ నెంబర్, డిస్ట్రిబ్యూటర్ పేరు, డిస్ట్రిబ్యూటర్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, కాంటాక్ట్ అడ్రస్ లాంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్ పోర్టల్‌లో లాగిన్ అయి గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.
SMS: హెచ్‌పీ ఎనీటైమ్లో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇందుకోసం HP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్టీడీ నెంబర్‌తో డిస్ట్రిబ్యూటర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి కన్స్యూమర్ నెంబర్ టైప్ చేసి హెచ్‌పీ ఎనీటైమ్ నెంబర్‌కు పంపాలి. రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత HPGAS అని టైప్ చేసి హెచ్‌పీ ఎనీటైమ్ నెంబర్‌కు మెసేజ్ చేస్తే సిలిండర్ బుక్ అవుతుంది.
HP Gas Quick Book & Pay: హెచ్‌పీ గ్యాస్ క్విక్ బుక్ అండ్ పే ద్వారా సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా https://myhpgas.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత క్విక్ బుక్ అండ్ పే సెక్షన్ ఓపెన్ చేయాలి. Quick Search లేదా Normal Search ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటర్ పేరు, కన్స్యూమర్ నెంబర్ సెర్చ్ చేసి సిలిండర్బుక్ చేయొచ్చు.
0 comments:
Post a comment