Govt Jobs 2020: 244 పోస్టులకు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండా జాబ్స్!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 244 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు (UCIL Recruitment 2020) ఖాళీగా ఉన్నాయి. ఇందుకుగానూ విడుదల చేసిన నోటిఫికేషన్ తుది గడువు డిసెంబర్ 10వ తేదీతో ముగియనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. అధికారిక వెబ్సైట్
నవంబర్ 20, 2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఉద్యోగానికి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. అయితే ఏ పరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ పరీక్షల మెరిట్, ఐటీఐ ట్రేడ్ విభాగంలో మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 244 పోస్టుల వివరాలు..
ఎలక్ట్రీషియన్ పోస్టులు - 80
ఫిట్టర్ పోస్టులు - 80
వెల్డర్ పోస్టులు - 40
టర్నర్ లేదా మెషినిస్ట్ పోస్టులు - 15
ఎంవీ మెకానిక్ పోస్టులు - 10
మెకానిక్ పోస్టులు - 10
ప్లంబర్ పోస్టులు - 4
కార్పెంటర్ పోస్టులు - 5
0 comments:
Post a comment