Fridge Bacteria: సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ-హైడ్రేషన్ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్‌ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.
* ఫ్రిజ్‌లో ఫుడ్ ఐటమ్స్ పెట్టేముందు అది హైజిన్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటన్నిటినీ వేర్వేరుగానూ, హానికరం వ్యాప్తి కాని ప్యాకింగ్ మెటీరియల్‌తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి.
* మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్ లాంటి మాంసాన్ని (రా-మీట్‌ను) ఒకేదానిలో ఉంచుకోకూడదు. దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలపకుండా ఉంచుకోవాలి.
* ఫ్రిజ్‌లో నుంచి తీసిన ఆహార పదార్థాలను యథావిధిగా తినడం కంటే ఉడికించుకోవడమో, నూనెలో వేయించడమో ఏదో ఒకటి చేసి తినడమే మేలు. ఆకుకూరలూ, కాయగూరలు అయితే కచ్చితంగా తగిన ఉష్ణోగ్రత దగ్గర ఉడికిన తర్వాతే తినాలి.
* ఇలా మాంసాహారాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల సాల్మొనెల్లా లేదా ఈ-కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక మాత్రమే తినాలి.
* డీప్ ఫ్రీజర్ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప… బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్) కావడం లేదని అర్థం.
* అలా ఫ్రిజ్‌లో చల్లదనం/ఉష్ణోగ్రత లేకపోతే పనితీరు బాగాలేదని గమనించి.. ఫ్రిజ్ రిపేర్ చేయించుకోవాలి.
* ప్రతి ఒక్కరూ ఫ్రిజ్‌ను నెలకు లేదా రెండు నెలలకొకసారైనా నిర్ణీత సమయంలో క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
0 Comments:
Post a Comment