Fengshui: లక్కీ బాంబూ ట్రీని ఇంట్లో అక్కడ పెంచితే...డబ్బులు వద్దన్నా వస్తూనే ఉంటాయట....
ఫెంగ్ షుయ్ లో ముందుగా మనకు గుర్తొచ్చే మరో బ్యాంబు ట్రీ దీన్నే లక్కీ వెదురు చెట్టు అని పిలుస్తారు. ఇది మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినదిగా చైనీయులు నమ్ముతారు. చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్ ప్రకారం, వెదురు మొక్క, లక్కీ ప్లాంట్ గా భావిస్తారు. ఎందుకంటే ఇది మంచి అదృష్టం మరియు సంపదను ఆకర్షిస్తుంది. ఇది ఇండోర్ ప్లాంట్...దీన్ని వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది. ఈ చెట్టు ఎలాగైతే పెరుగుతుందో అలాగే దీని మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. వ్యాపార సంస్థలలో నరదృష్టి నివారణకు, ధనం ఆకర్షణకు, వ్యాపారభివృథ్థికి ఇది చాలా మంచిది .
పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ద ,సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి) .మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు
ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, నరదృష్టి , కనుదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు ,థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .
ఈ లక్కీ వెదురు మొక్క స్థానం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే దానిపై కొన్ని చిట్కాలు ఉన్నాయి:
* ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం.
* ఇది ఇండోర్ మొక్క, ప్రత్యక్ష సూర్యకాంతి క్రింద ఉంచరాదు.
* వెదురు మొక్కను పారదర్శక కంటైనర్లో ఉంచాలి, తద్వారా దాని మూలాలను చూడవచ్చు.* ఎర్ర-రంగు బ్యాండ్ త ఈ మొక్కలను దగ్గరకు కట్టాలి.
* రంగులో పసుపు లేదా ముదురు ఆకుపచ్చ కాండాలతో ఉన్న వెదురు మొక్కను ఉపయోగించడం మానుకోండి.
0 comments:
Post a comment