Diabetes Diet: బీపీ, డయాబెటీస్ ఉన్న వాళ్లకు బెస్ట్ డైట్ ఇదే.. ఇలా తయారు చేసుకోండి
ప్రస్తుత తీరిక లేని జీవితాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలామందికి బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు సాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో రైస్ కంటెంట్ ను తగ్గించి మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సిన అవసరముంది. అయితే రైస్ తోనూ శరీరానికి సరిపడ పోషకాలు అందించే వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. అదే పేయా. హృద్రోగులు, బీపీ, డయాబెటిస్ రోగులకు ప్రత్యేకాహారంగా అందించే ఈ వంటకంలో ఎన్నో పోషకాలున్నాయి. మరి ఈ పేయాను ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ రైస్.. 300 గ్రాములు
నీరు... 1500 మిల్లీ లీటర్లు
ఉప్పు... తగినంత
ఆవాలు... అర టీస్పూన్
జీలకర్ర... ఒక టీస్పూన్అల్లం...
అంగుళం ముక్కలో పావు వంతు
మెంతులు... 1/4 టీస్పూన్
దాల్చిన చెక్క... 1/4 అంగుళం ముక్క
యాలకులు... 1
లవంగాలు... 2
కొబ్బరి పాలు లేదా పాలు... 100 మిల్లీ లీటర్లు
లీటరు వంటకానికి ఈ పదార్థాలు అవసరమవుతాయి.
ముందుగా రెడ్ రైస్ శుభ్రంగా కడిగి నీటిలో 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ వ్యవధిలో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించి పొడిగా చేసుకోవాలి. ప్రెజర్ కుక్కర్ లో నీటిని వేడి చేసుకోవాలి. అనంతరం ఆ నీటిలో ఉప్పు, కడిగిన బియ్యం, సుగంధ ద్రవ్యాల పొడి(మెంతులు, జీలకర్ర, ఆవాలు) వేసి బాగా కలిపి కుక్కర్ పై మూతపెట్టాలి. దాదాపు 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికిచాలి. ఆవిరి లేకుండా మూత తీసివేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి పాలు లేదా పాలను జోడించాలి. వేపుడు కూరలు లేదా పచ్చడితో ఈ వంటకాన్ని ఆరగించవచ్చు.
రెడ్ రైస్ లో ఎక్కువ యాంటి యాక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర, గ్లైసెమిక్ తక్కువగా ఉండటమే కాకుండా ఐరన్, జింక్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్ తగిన మోతాదులో ఉంటాయి. ఫలితంగా అధిక రక్తపోటు, హృద్రోగులు, ఉబకాయం ఉన్నవారికి మంచి డైట్ గా ఈ పేయా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే మెగ్నిషియం, ఐరన్, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండి శ్వాసకోశ విధులను నియంత్రించడంలో సహాయపడతుంది. పేయాలో ఉపయోగించే కొబ్బరిపాలల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని భావిస్తే నీటితో సరిపెట్టుకోవచ్చు.
0 Comments:
Post a Comment