Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 ఖాళీలను ప్రకటించింది. ఇవి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 డిసెంబర్ 21న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 27 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. https://www.joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు ఉంటాయి.
అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ మొత్తం పోస్టులు- 25
ఎస్సీ- 5
ఎస్టీ- 14
ఓబీసీ- 6
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 27
అడ్మిట్ కార్డ్ విడుదల- 2021 ఫిబ్రవరి 6
ప్రిలిమినరీ ఎగ్జామ్- 2021 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20
ఫైనల్ సెలక్షన్- 2021 ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏప్రిల్ వరకు
విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే జనరల్ డ్యూటీ పోస్టులకు అర్హులు కాదు.
వయస్సు- 1996 జూలై 1 నుంచి 2000 జూన్ 30 మధ్య జన్మించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేసి ప్రిలిమినరీ సెలక్షన్‌కు పిలుస్తారు.
అభ్యర్థులు మొదట https://www.joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో opportunities పైన క్లిక్ చేయాలి.
Recruitment of Assistant Commandant02/2021 Batch అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవాలి.
ఆ తర్వాత Asst. Commandant General Duty (Male) పోస్ట్ సెలెక్ట్ చేయాలి.
I Agree బటన్ పైన క్లిక్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి.
దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని కాపీ భద్రపర్చుకోవాలి.
0 Comments:
Post a Comment